కరోనాకు మరో కొత్త వ్యాక్సిన్

కరోనాకు మరో కొత్త వ్యాక్సిన్
  •     తొలి ఎంఆర్ఎన్ఏ టీకాను అభివృద్ధి చేసిన సీసీఎంబీ  
  •     ఎలుకలపై క్లినికల్ ట్రయల్స్​సక్సెస్ 

సికింద్రాబాద్, వెలుగు:   కరోనా మహమ్మారి నివారణకు మరో కొత్త వ్యాక్సిన్​రాబోతోంది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లోని ది సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సైంటిస్టులు ఎం-ఆర్ఎన్ఏ టెక్నాలజీ ద్వారా ఈ కొత్త వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారు. దీనితో ఎలుకలపై జరిపిన క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయ్యాయని సీసీఎంబీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ మధుసూదన్ రావు, డైరెక్టర్ వినయ్ కుమార్ వెల్లడించారు. టీకాను పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతోనే సీసీఎంబీలోని  జీనోమ్​ ల్యాబ్ లో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. క్లినికల్ ట్రయల్స్​లో భాగంగా మొదట ఎలుకలపై ప్రయోగాలు జరిపినట్లు తెలిపారు. కరోనా స్పైక్ ప్రొటీన్ ను టార్గెట్ గా చేసుకుని ఈ టీకాను డెవలప్ చేసినట్లు చెప్పారు. ఈ టీకా ఎలుకల్లో వైరస్ ను నిర్మూలించడంలో 90 శాతానికి పైగా ఎఫెక్టివ్ గా పని చేసిందన్నారు.