ఢిల్లీలోని నజాఫ్ గడ్ లో నిక్కీ యాదవ్ అనే యువతిని హత్య చేసి ఫ్రిజ్ లో దాచిన ఘటన కేసులో విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. తనను పెళ్లి చేసుకోమని పట్టుబట్టడంతో యువతిని ఛార్జింగ్ వైర్ తో చంపినట్లు నిందితుడు విచారణలో అంగీకరించారు. మరోవైపు ఆ యువతి హత్యకు ముందు చివరిసారిగా ఫిబ్రవరి 9న ఢిల్లీలోని తన ఇంట్లోకి వెళ్తున్న సీసీ టీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఈ ఫుటేజ్ లో ఆ యువతి గేట్ దగ్గర నుంచి మెట్లు ఎక్కుతూ పైకి వెళ్తూ కనిపించింది.
ఈ నెల 9న ఢిల్లీలోని నజాఫ్ గడ్ ప్రాంతంలో ఉన్న ఓ దాబాలో సాహిల్ గహ్లోత్ అనే వ్యక్తి యువతిని చంపి ఫ్రిజ్ లో దాచిండు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. చాలా రోజులుగా సాహిల్ గహ్లోత్ యువతితో డేటింగ్ లో ఉన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం సాహిల్ గహ్లోత్ కు వేరే అమ్మాయితో ఎంగేజ్ మెంట్ కావడంతో అది తెలిసిన నిక్కీ తనను పెళ్లి చేసుకోమని సాహిల్ తో వాదనకు దిగింది. 2 గంటల పాటు ఇద్దరు కారులో గొడవపడ్డారు. దీంతో సాహిల్ ఆ యువతిని చార్జింగ్ వైర్ తో హత్య చేసి మృతదేహంతో 40 కి.మీ ప్రయాణించి.. చివరికి తన దాబాలోని ఫ్రిడ్జిలో పెట్టాడు. తర్వాతి రోజు ఫిభ్రవరి 10న మరో అమ్మాయి మెడలో తాళి కట్టాడు. నిక్కీ కనిపించకపోడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు సాహిల్ ను అరెస్ట్ చేశారు. పోలీసులు విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
