జెరూసలేం: అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ(సీజ్‌ఫైర్) ఒప్పందాన్ని ఇజ్రాయెల్ సమర్థించింది. అయితే, ఈ ఒప్పందం కేవలం ఇరాన్‌కు మాత్రమే పరిమితమని, దీనికి లెబనాన్‌కు సంబంధంలేదని తేల్చిచెప్పారు. లెబనాన్‌లో తాము జరుపుతున్న సైనిక చర్యకు ఈ ఒప్పందం వర్తించదని నెతన్యాహు ఆఫీసు స్పష్టంచేసింది.
బుధవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన నెతన్యాహు.. ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఇరాన్ నుంచి అమెరికా, ఇజ్రాయెల్, అరబ్ పొరుగు దేశాలకు అణు, క్షిపణి, ఉగ్రవాద ముప్పులేకుండా ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు పూర్తిమద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే, కాల్పుల విరమణలో లెబనాన్ భాగంకాదని ఆయన స్పష్టంచేశారు.
