న్యూఇయర్ సెలబ్రేషన్స్..అలరించనున్న సెలబ్రెటీలు

న్యూఇయర్ సెలబ్రేషన్స్..అలరించనున్న సెలబ్రెటీలు

న్యూఇయర్ వేడుకలకు హైదరాబాద్ సిద్ధమవుతోంది.  కరోనాతో రెండేళ్లు న్యూఇయర్ ఈవెంట్స్కు దూరంగా ఉన్న జనం.. ఈసారి మాత్రం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. రేపు రాత్రి జరిగే వేడుకల కోసం ఈవెంట్ ఆర్గనైజర్స్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ లిమిటెడ్ ఫుడ్, అన్ లిమిటెడ్ లిక్కర్తో.. ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించి ప్రజలను అట్రాక్ట్ చేస్తున్నారు. 

థండర్ స్టైక్  పార్క్లో సింగర్ రామ్  మిరియాల పాటలతో అలరించనున్నారు. కంట్రీక్లబ్లో నిర్వహిస్తున్న ఈవెంట్లో డీజే ఆసిఫ్  ఇక్బాల్, గాయని అలీషా చినాయ్, అభిజిత్  సావంత్, బాంబే వైకింగ్స్, సినీతార స్నేహగుప్తా పాల్గొంటున్నారు. నోవాటెల్లో ఆర్టిస్ట్ ఎమ్ కెషిఫ్ట్ లైవ్ బ్యాండ్ ఏర్పాటు చేశారు. గచ్చిబౌలి స్టేడియంలో డిజేషాన్, ఆర్యన్  గాలా, రికాయాలు సందడి చేయనున్నారు. ఓం కన్వెన్షన్లో దర్శన్  రావల్తో వేడుక నిర్వహిస్తున్నారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లోని  గచ్చిబౌలిలోని షెరటాన్ హోటల్లో డీజే షరాన్, అమీర్లు అతిథులను ఉత్సాహపరచనున్నారు. వండర్లాలో.. సన్ బర్న్ ఈవెంట్ నిర్వహిస్తోంది.

మరోవైపు న్యూఇయర్ ఈవెంట్స్పై ఈసారి గట్టి నిఘా పెట్టామని పోలీసులు చెబుతున్నారు. అర్థరాత్రి ఒంటిగంట వరకే వేడుకలకు పర్మిషన్ ఉందన్నారు. రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.