హైదరాబాద్లో ఇట్లయితే కష్టం

హైదరాబాద్లో ఇట్లయితే కష్టం

కేసులిట్లే పెరిగితే జులై 31 నాటికి పరిస్థితి తీవ్రమైతది: కేంద్ర బృందం
సిటీలో కేసుల నమోదుపై ఆందోళన
కరోనా కట్టడిపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌‌, అధికారులతో చర్చ
ప్రజలు సహకరించాలని సూచన

హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్ రూల్స్ సడలించడంతో హైదరాబాద్ లో కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, కేసులు ఇలాగే పెరుగుతూ పోతే.. జూలై 31 నాటికి పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని కేంద్ర బృందం ఆందోళన వ్యక్తంచేసింది. బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సంజయ్ జాజు ఆధ్వర్యంలోని కేంద్ర బృందం స‌‌భ్యులు వికాస్ గాడే, రవీంద‌‌ర్‌‌తో క‌‌లిసి జీహెచ్‌ఎంసీ కమిష‌‌నర్ డి.ఎస్‌‌.లోకేశ్‌ కుమార్‌‌, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేత మహంతితో కలిసి సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తిని అరిక‌‌ట్టేందుకు తీసుకుంటున్న చర్యల గురించి సమావేశంలో చ‌‌ర్చించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో జోన్లు, స‌‌ర్కిళ్లు, వార్డుల వారీగా పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటళ్లు, ల్యాబ్‌లలోనూ కరోనా పరిక్షలు నిర్వహిస్తున్నందున, ప్రైవేట్‌‌గా నిర్వహించిన పరిక్షలలోనే 70 శాతం పైబడి పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్టు తెలిపారు.

హోం కంటెయిన్‌మెంటే మార్గం
జీహెచ్‌ఎంసీ పరిధిలో గుర్తించిన పాజిటివ్ కేసుల సంఖ్య, సంబంధిత కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్‌కు అనుసరిస్తున్నపద్ధతి, కరోనా సింప్టమ్స్ కనిపించిన వ్యక్తులకు పరిక్షలు నిర్వహించేందుకు ఉన్నసదుపాయాలను కేంద్ర బృందం స‌‌భ్యులు అడిగి తెలుసుకున్నారు. హాస్పిటళ్లు, హోం క్వారంటైన్‌‌, హోం ఐసోలేష‌‌న్‌‌, కంటెయిన్‌మెంట్ అంశాల గురించి చ‌‌ర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాను నియంత్రించేందుకు హోం కంటెయిన్‌మెంట్ మాత్రమే మార్గమని సంజయ్ జాజు సూచించారు. ప్రజలంతా సహకరించడమే కరోనా కట్టడిలో కీలకమన్నారు. రోజుకు 100 కేసుల కంటే ఎక్కువ‌‌గా వస్తున్నందున జీహెచ్‌ఎంసీలోనే 4 జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, డిప్యూటీ కమిష‌‌నర్లతో వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కరోనా కంట్రోల్ రూమ్‌ విధుల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ అదనపు కమిష‌‌నర్ బి.సంతోష్‌, సీసీపీ దేవేంద‌‌ర్‌‌రెడ్డి , కరోనా కంట్రోల్ రూమ్‌‌ ఓఎస్‌‌డీ అనురాధ పాల్గొన్నారు.

For More News..

ఈసారి ఇంట్లోనే బోనాలు

ఒక్కొక్కరికీ 12 గంటల డ్యూటీ!

బతుకు భరోసా లేని జర్నలిస్టులు

ఆస్పత్రి వాష్ రూంలో కరోనా పేషంట్ డెడ్ బాడీ