కేంద్రం ప్రభుత్వం సామాన్యుడికి చేసిందేమీలేదు

కేంద్రం ప్రభుత్వం సామాన్యుడికి చేసిందేమీలేదు

కేంద్రలో ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సర్కారు చేసిన పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా ఆర్థిక అభివృద్ధి ఆగిపోయిందని ఆరోపించారు. సామాన్య మానవుడికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీలేదన్నారు. తెలంగాణలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని లెక్కలతో సహా చూపిస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అమలవుతున్నాయని కేంద్రం చెపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. గత ఆరేళ్లలో రాష్ట్రం రూ.2.72 లక్షల కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి ఇస్తే… తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చింది రూ. 1,43,329 కోట్లు మాత్రమేనన్నారు.

గత ఆరేళ్లుగా రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికలలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిందన్నారు కేటీఆర్. దుబ్బాక ఉపఎన్నికల్లో కూడా  టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాత్రం జనాల్లో భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో అన్ని మతాలకు స్థానం ఉందని… రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం విపక్షాలకు సరికాదన్నారు. మతం అనేది ఏ పార్టీకి కూడా ప్రచారాస్త్రం కాకూడదన్నారు కేటీఆర్.