
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ మున్సిపాలిటీకి తప్ప దేశంలోని అన్ని మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేస్తున్నదని సీఎం అరవింద్ కేజ్రివాల్ విమర్శించారు. ఢిల్లీ మున్సిపాలిటీకి 10 ఏండ్ల కాలానికి రూ.12 వేల కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఢిల్లీపై మోడీ సర్కార్ వివక్ష చూపుతున్నదని అన్నారు. నగరంలోని పలువురు మున్సిపల్ డాక్టర్లకు కొన్ని నెలలుగా జీతాలు చెల్లించడం లేదని, దాంతో వారు ధర్నా చేస్తున్నారని, ఇది మనందరికీ సిగ్గు చేటు అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో రాజకీయాలు చేయరాదన్నారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేనంత కరువు ఏం వచ్చిందని ప్రశ్నించారు