న్యూఢిల్లీ: కోల్ ఇండియా అనుబంధ సంస్థ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ (సీఎంపీడీఐఎల్) ఐపీఓ ఈ నెల 20–24 తేదీల్లో జరుగుతుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం మార్చి 18న బిడ్డింగ్ నిర్వహిస్తారు. కోల్ ఇండియా తన వద్ద ఉన్న 10.71 కోట్ల షేర్లను విక్రయించనుంది. కొత్త షేర్ల జారీ ఉండదు. సీఎంపీడీఐఎల్ బొగ్గు అన్వేషణ, గనుల ప్రణాళిక, పర్యావరణ ఇంజనీరింగ్ వంటి సేవలను అందిస్తోంది.
