
హైదరాబాద్: మధ్యాహ్న భోజన పథకం కింద జీహెచ్ఎంసీ ప్రాంతానికి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను కేంద్ర సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఈ పథకం కింద వంట ఖర్చు కోసం 2015-16 నుంచి కేంద్ర సర్కార్ రూ.116.9 కోట్లు ఇచ్చిందన్నారు. జీహెచ్‌ఎంసీ ప్రాంతంలోని 1,393 పాఠశాలల్లో (హైదరాబాద్‌లో 959 పాఠశాలలు, మేడ్చల్-మల్కాజ్‌గిరి 264, రంగారెడ్డిలో 170) 2 లక్షలకు పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం 2,215 వంట-సహాయకులు (సీసీహెచ్) పని చేస్తున్నారని వివరించారు.