
- ఫైనల్లో 6 వికెట్ల తేడాతో
- సౌత్ జోన్‌పై విజయం
బెంగళూరు: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న సెంట్రల్ జోన్.. 11 ఏండ్ల తర్వాత దులీప్ ట్రోఫీ సొంతం చేసుకుంది. చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో కొద్దిగా ఇబ్బంది ఎదురైనా.. సోమవారం ముగిసిన ఫైనల్లో సెంట్రల్ 6 వికెట్ల తేడాతో సౌత్ జోన్‌పై గెలిచింది. 65 రన్స్ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆఖరి రోజు బరిలోకి దిగిన సెంట్రల్ రెండో ఇన్నింగ్స్‌లో 20.3 ఓవర్లలో 66/4 స్కోరు చేసింది.
టాపార్డర్‌లో డానిష్ మాలేవర్ (5), శుభమ్ శర్మ (8), సారాన్ష్ జైన్ (4) ఫెయిల్ కావడంతో సెంట్రల్ 24/3తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో అక్షయ్ వాడ్కర్ (19 నాటౌట్), రజత్ పటీదార్ (13), యష్ రాథోడ్ (13 నాటౌట్) నిలకడగా ఆడి టీమ్‌ను గెలిపించారు. గుర్జప్నీత్ సింగ్, అంకిత్ శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. యష్ రాథోడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, టోర్నీలో 16 వికెట్లు, 136 రన్స్ చేసిన సారాన్ష్ జైన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది.