హైదరాబాద్, వెలుగు: మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర పర్యాటక, గిరిజన మంత్రిత్వ శాఖలు రూ.3.70 కోట్లు మంజూరు చేశాయి. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చొరవతో నిధులు మంజూరయ్యాయని ఆయన కార్యాలయం పేర్కొంది.
గతంలో ‘గిరిజన సర్క్యూట్’ పేరుతో కేంద్ర పర్యాటక శాఖ రూ.80 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ములుగు, లక్నవరం, మేడారం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగత జలపాతం వంటి ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
