ఈరోడ్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమిళనాడు హక్కులను కాలరాస్తోందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ధ్వజమెత్తారు. శనివారం పశ్చిమ ఈరోడ్ జిల్లాలోని గోబిచెట్టిపాళయంలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. విద్యారంగానికి సంబంధించి రావాల్సిన దాదాపు రూ.3,000 కోట్లను కేంద్రం విడుదల చేయలేదని ఉదయనిధి ఆరోపించారు.
కేంద్ర బడ్జెట్‌లో కనీసం ‘తమిళనాడు’ పేరు కూడా ప్రస్తావించలేదని రాష్ట్రానికి కొత్త పథకాలు తీసుకురాలేదని విమర్శించారు. కేంద్రం తమిళనాడుపై హిందీని రుద్దడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
ఈ ఎన్నికలు కేవలం పార్టీల మధ్య కాదని తమిళనాడుకు, ఢిల్లీకి మధ్య జరుగుతున్న పోరాటమని అభివర్ణించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామిని ప్రధాని మోదీకి బానిసగా మారారని విమర్శించారు.

