- డిమాండ్ బాగుంటే మరో 4 శాతం సేల్
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) లో 2.5 శాతం వాటాను ఆఫర్- ఫర్ -సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా విక్రయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డిమాండ్‌ను బట్టి మరో 4 శాతాన్ని 'గ్రీన్ షూ ఆప్షన్' ద్వారా విక్రయించే వెసులుబాటును ఉంచుకుంది. నాన్ రిటైల్ ఇన్వెస్టర్లకు మంగళవారం, రిటైల్ ఇన్వెస్టర్లకు బుధవారం బిడ్డింగ్ ప్రారంభమవుతుంది.
ఈ ఆఫర్ ఫర్ సేల్ కోసం ప్రతి షేరు కనీస ధరను రూ.382 గా నిర్ణయించినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (దీపం) కార్యదర్శి అరుణిష్ చావ్లా తెలిపారు. కంపెనీ షేర్లు సోమవారం రూ.429 వద్ద ముగిశాయి. గ్రీన్ షూ ఆప్షన్ పూర్తిగా వినియోగిస్తే ప్రభుత్వం ఎల్ఐసీలో గరిష్టంగా 6.5 శాతం వరకు వాటాను విక్రయించనుంది. ప్రస్తుతం ప్రభుత్వానికి ఈ కంపెనీలో 96.5శాతం వాటా ఉంది.
