అమెజాన్ అధినేత రికార్డు: ఒక్కరోజులో రూ.97 వేల కోట్లు లాభం

అమెజాన్ అధినేత రికార్డు: ఒక్కరోజులో రూ.97 వేల కోట్లు లాభం

గత కొంతకాలంగా ప్రపంచంలోనే నెంబర్ వన్ కుబేరుడిగా కొనసాగుతున్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద మరింత పెరిగింది. వెబ్ షాపింగ్ ట్రెండ్స్ పై అమెజాన్ షేరు విలువ అమాంతం పెరగడంతో, జెఫ్ బెజోస్ కు ఒక్కరోజులోనే రూ.97 వేల కోట్లు వచ్చిపడ్డాయి. ఇప్పటివరకు ఓ వ్యక్తి ఒక్కరోజులో ఇంత మొత్తం సంపాదించింది లేదు. ఇప్పుడీ ఘనత బెజోస్ దక్కించుకున్నారు.దీంతో ఆయన సంపద విలువ 189 బిలియన్ డాలర్లకు చేరింది.

ఈ ఒక్క ఏడాదిలోనే జెఫ్ బెజోస్ 74 బిలియన్ డాలర్లు సంపాదించారంటే అమెజాన్ ఎంతలా ఫేమస్ అయ్యిందో చెప్పవచ్చు. ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ గోల్డ్ మన్ శాక్స్ కూడా అమెజాన్ షేర్లపై సానుకూల రేటింగ్ ఇవ్వడంతో స్టాక్ మార్కెట్లో అమెజాన్ ప్రభంజనం కొనసాగింది. అమెజాన్ షేరు 2018 డిసెంబరు తర్వాత ఈ స్థాయిలో లాభపడడం ఇదే మొదటి సారి.