ఓటరు అప్లికేషన్ల పరిశీలన వేగవంతం చేయండి: సీఈవో వికాస్​రాజ్

ఓటరు అప్లికేషన్ల పరిశీలన వేగవంతం చేయండి: సీఈవో వికాస్​రాజ్

హైదరాబాద్, వెలుగు:  కొత్త ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణల కోసం వచ్చిన అప్లికేషన్ల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) వికాస్ రాజ్ ఆదేశించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు.  ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణలకు దరఖాస్తుల నిర్వహణపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా వికాస్​ రాజ్​మాట్లాడుతూ.. ఓటరు జాబితా అప్లికేషన్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

18, 19 ఏండ్ల వయసు నిండిన ప్రతి ఒక్కరి వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలు, లింగ నిష్పత్తి వారీగా అప్లికేషన్ల పరిశీలన పూర్తి చేయాలని సూచించారు.  అధిక మొత్తంలో ఎన్నికల ఖర్చు జరిగే అవకాశమున్న నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలన్నారు. వారానికి ఒకసారి ప్రత్యేక రిపోర్ట్​ పంపాలని ఆదేశించారు. గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులతో  తరచుగా సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరిచాలని స్పష్టం చేశారు.  దివ్యాంగులు, వయోవృద్ధులను ఓటరు జాబితాలో ప్రత్యేక మార్కింగ్ చేయాలని వికాస్ రాజ్ పేర్కొన్నారు.