
భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కంటే ముందుగా మాట్లాడుకోవాల్సింది.. అతని సతీమణి ధనశ్రీ వర్మ గురుంచి. ఇటీవల కాలంలో శ్రేయాస్ అయ్యర్‌తో ముడిపెడుతూ ఆమె గురుంచి ఏవేవో లేని పోనీ పుకార్లు పుట్టిస్తున్నారు కానీ తాను మేలిమి బంగారమట. ఈ విషయాన్ని చాహల్ తన నోటి నుంచి డైరక్ట్‌గా చెప్పకపోయినా.. ఆమెపై ఉన్న ప్రేమను నలుగురితో పంచుకోవడం ద్వారా అందరికీ తెలిసేలా చేశాడు.
క్రికెటర్ అయిన చాహల్‌కు.. డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీకి ఎలా ముడిపడింది..? అన్న సందేహం అందరికీ ఉన్నదే. ఆ రహస్యాలను, వారిద్దరి ప్రేమకథను చాహల్.. ఇటీవల రణవీర్ అల్లాబాడియా యూట్యూబ్ షోలో పూసగుచ్చినట్లు వెల్లడించారు. ధనశ్రీ నుండి ఆన్లైన్ డ్యాన్స్ క్లాసులు నేర్చుకున్నానని చెప్పిన చాహల్.. ఆ డాన్స్‌లకు, ఆమె స్టైల్ కు ఫిదా అయిపోయి పడిపోయాయని తెలిపారు.
డాన్స్ నేర్పిస్తావా అని మెసేజ్ చేశా..
"మొదట ధనశ్రీని టిక్‌టాక్ రీల్స్‌తో పాటు మరికొన్ని రీల్స్‌లో చూశా. ఆమె డ్యాన్స్ చూసి నాకూ నేర్చుకోవాలనిపించింది. అది లాక్డౌన్ సమయం కావడంతో ఖాళీగా ఉండడం ఎందుకని.. నాకు డ్యాన్స్ నేర్పించగలరా అని ఆమెకు మెసేజ్ చేశా. అందుకు తను సరేనంది. వెంటనే ఆన్లైన్ క్లాసులు మొద్గలుపెట్టింది. మొదటి రెండు నెలలు డ్యాన్స్ గురించి తప్ప మరేమీ మాట్లాడుకోలేదు. సరసాలు కూడా లేవు. మేం స్నేహితులు కూడా కాదు. కేవలం డ్యాన్స్‌కు సంబంధించి మాత్రమే తనతో మాటలుండేవి."
నీతో డేటింగ్ చేయడం నాకు ఇష్టం లేదు..
"అలా రోజులు గడిచే కొద్దీ మా మధ్య చనువు పెరిగింది. ఒకరి విషయాలు మరొకరం పంచుకునేవాళ్లం. కొన్నిరోజులు గడిచాక..ఓరోజు ఈ లాక్డౌన్లో కూడా మీరు ఎంత సంతోషంగా ఉన్నారని తనను అడిగాను. అప్పుడు ఆమె తన వ్యక్తి జీవితం గురించి చెప్పింది. అక్కడే మా ఇష్టాలు కలిశాయి. వెంటనే ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాను అని అమ్మతో చెప్పాను. తను సరేనంది. ఆపై ఆమెకు (ధనశ్రీ) చెప్పాను. నీతో డేటింగ్ చేయడం నాకు ఇష్టం లేదు.. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని సూటిగా చెప్పాను. అలాంటి సంభాషణలు మా మధ్య చాలా నడిచాయనుకోండి.." అంటూ చాహల్ నవ్వుతూ తన ప్రేమ రహస్యాలు బయటపెట్టారు. ఈ వీడియోను మీరూ తిలకించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపగలరు.