హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

హనుమకొండ, వెలుగు: జిల్లా కలెక్టర్ గా చాహత్ బాజ్ పాయ్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు కలెక్టర్ గా ఉన్న స్నేహ శబరీశ్ మహబూ బాబాద్ జిల్లాకు ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఆమె స్థానంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పని చేస్తున్న చాహత్ బాజ్ పాయ్ ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతేడాది జూన్ లోకలెక్టర్గా వచ్చిన స్నేహ శబరీశ్, గ్రేటర్ కమిషనర్ గా చాహత్ బాజ్ పాయ్ పాలనలో తమదైన ముద్ర వేశారు.

కలెక్టర్ గా ఛార్జ్ తీసుకున్న చాహత్ బాజ్ పాయ్ ని తన ఛాంబర్ లో అడిషనల్ కలెక్టర్ ఎన్.రవి. డీఆర్వో వైవీ. గణేశ్, ఆర్డీవోలు రాథోడ్ రమేశ్, కన్నం నారాయణ, ఇతర అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ చార్జి కమిషనర్ గా ఆమె అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.