మల్లారెడ్డి దంపతుల 50 ఏండ్ల పెండ్లి వేడుక

మల్లారెడ్డి దంపతుల 50 ఏండ్ల పెండ్లి వేడుక
  • మునీరాబాద్​లో ఘనంగా సంగీత్
  • భార్యతో కలిసి మాజీ మంత్రి స్టెప్పులు

మేడ్చల్, వెలుగు: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి దంపతుల 50 ఏండ్ల వివాహ మహోత్సవ (గోల్డెన్ జూబ్లీ) వేడుకలు మునీరాబాద్​లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత్ కార్యక్రమంలో మల్లారెడ్డి తన భార్య కల్పనతో కలిసి డాన్స్ చేసి అందరినీ ఉత్సాహపరిచారు. పెళ్లైన కొత్తలో తన వద్ద ఒక సైకిల్, రెండు పాల క్యాన్లు మాత్రమే ఉండేవని, తన భార్య సహకారంతోనే నేడు దేశంలోనే అతిపెద్ద విద్యాసంస్థల అధినేతగా, రాజకీయాల్లోనూ, సోషల్ మీడియాలోనూ ఇంతటి గుర్తింపు పొందానని మల్లారెడ్డి ప్రకటించారు. నేటి తరం యువత చిన్న చిన్న సమస్యలకే విడాకులు తీసుకుంటూ జీవితాలను ఇబ్బందుల్లో పడేస్తున్నారని, ప్రతిబంధకాలను అధిగమించి ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యకర్తలే తన కుటుంబమని, పెళ్లైన 50 ఏండ్ల తర్వాత ఇలా సంగీత్ నిర్వహించడం ఒక చరిత్ర అని చెబుతూ తనదైన శైలిలో సందడి చేశారు.