రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు పడే ఛాన్స్

 రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు పడే ఛాన్స్

తెలంగాణ లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండం, బంగాళాఖాతంలోని ఒడిశా తీరంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వలన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వీటి ప్రభావంతో ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇవాళ, రేపు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు( గంటకు 30 నుండి 40 కి మీ వేగంతో ) కూడిన వర్షములు కొన్ని జిల్లాలల్లో ఒకటి రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పింది.

నిన్న కూడా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది.