పాలన రివర్స్.. అందుకే వాకింగ్ రివర్స్

పాలన రివర్స్.. అందుకే వాకింగ్ రివర్స్

ఏపీ అసెంబ్లీ నుంచి  టీడీపీ వాకౌట్ చేసింది. పేదల గృహ నిర్మాణంలో ప్రభుత్వం సరిగా సమాధానం లేదంటూ సభ నుంచి వాకౌట్ చేసింది. అనంతరం అసెంబ్లీ బయట అభివృద్ధిలో రాష్ట్రం వెనక్కి వెళుతుందని, పాలన రివర్స్ లో జరుగుతుందంటూ టీడీపీ ర్యాలీ నిర్వహించింది. పార్టీ ఎమ్మెల్యేలతో  కలిసి  చంద్రబాబు రివర్స్ లో నడుస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు చంద్రబాబు. టెండర్లన్నీ రిజర్వ్ చేశారని అన్నారు. అమరావతిలో రెండు లక్షల కోట్ల అభివృద్ధి పనులను ఆపేశారని అన్నారు. పెట్టుబడులు రావడం లేదని..అభివృద్ధి జరగడం లేదన్నారు.