ఇంగ్లీష్ రాదా? .. మీరెక్కడ చదివారో చెబితే నేర్చుకుంటా..

ఇంగ్లీష్ రాదా? .. మీరెక్కడ చదివారో చెబితే నేర్చుకుంటా..

2430 జీవోను చంద్రబాబు చదివారా లేదా అని ప్రశ్నించారు ఏపీ సీఎం జగన్. జీవోలో తప్పేముందని.. అర్థం చేసుకోవడంలో చంద్రబాబు లోపం ఉందన్నారు జగన్.  అన్యాయంగా ఆధారాలు లేకుండా వార్తలు రాసినా కామ్ గా ఉండాలా  అన్నారు జగన్. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు కనీస జ్ఞానం లేనట్లుగా వ్యవహరిస్తున్నారి అన్నారు.

తనకు ఇంగ్లీషు రాదని జగన్ చులకనగా మాట్లాడుతున్నారన్నారు చంద్రబాబు. తాను ఎస్వీ యూనివర్శిలో చదివానని …మరి సీఎం ఎక్కడ  చదివారో చెబితే అక్కడ నేర్చుకుంటామన్నారు చంద్రబాబు.  గతంలో వైఎస్ ఇచ్చిన జీవోను  వెనక్కి  తీసుకున్నారని  గుర్తుచేశారు. జీవోను అందరూ ఖండిస్తున్నారన్నారు చంద్రబాబు.