EVMల మొరాయింపుపై YCP ఒక్క మాటా మాట్లాడలేదు : చంద్రబాబు

EVMల మొరాయింపుపై YCP ఒక్క మాటా మాట్లాడలేదు : చంద్రబాబు

కేంద్ర  ఎన్నికల కమిషన్ ను కలిశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏపీ ఎన్నికల నిర్వాహన సరిగ్గా లేదని కమిషన్ కి వివరించారు బాబు. సీఈసీ సునీల్‌ అరోడాతో శనివారం సమావేశమై రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో తలెత్తిన సమస్యలపై ఫిర్యాదు చేశారు. ఈవీఎంల పనితీరు సరిగ్గా జరగలేదని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబుతో సహా 15 మంది టీడీపీ ప్రతినిధుల బృందం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలమైందని తెలిపారు చంద్రబాబు. పలుచోట్ల ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందని అనుమానిస్తున్నామన్నారు.

శనివారం, ఆదివారం డిల్లీలోనే ఉంటానని, ఈవీఎంల వ్యవహారాన్ని పలు పార్టీల జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఏపీ చరిత్రలో ఇంతటి అరాచకాలను ఎప్పుడూ చూడలేదన్న బాబు..ఎన్నికల నిర్వహణలో ఈసీ వ్యవస్థాగతంగా వైఫల్యం చెందిందన్నారు. బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించే పద్ధతి మళ్లీ రావాలన్నారు. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరించి, కారణాలు చెప్పకుండానే అదికారులను బదిలీలు చేసిందని తెలిపారు చంద్రబాబు. ఈవీఎంల మొరాయింపుపై YSRCP ఒక్క మాటా మాట్లాడలేదన్నారు. మోడీ సూచనలతో ఈసీ ఏకపక్ష వైఖరిగా వ్యవహరించిందని చెప్పారు చంద్రబాబు.