తప్పిన ఘోర ప్రమాదం : సీఎం చంద్రబాబుకు.. 3 అడుగుల దూరంలో ఆగిన రైలు

తప్పిన ఘోర ప్రమాదం : సీఎం చంద్రబాబుకు.. 3 అడుగుల దూరంలో ఆగిన రైలు

విజయవాడ వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు ఘోర ప్రమాదం తప్పింది.  మధురానగర్ రైల్వే ట్రాక్‌పై  చంద్రబాబు  వరద తీవ్రతను పరిశీలిస్తుండగా అదే సమయంలో ఎదురుగా  ట్రైన్   వచ్చింది.  వెంటనే  సీఎం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం కావడంతో  చంద్రబాబు  పక్కకు నిలడ్డారు. దీంతో ప్రమాదం తప్పింది.

 బుడమేరు కింద నుంచి ప్రవహిస్తుండటంతో సరిగా కనిపించడం లేదని రైలు ట్రాక్ పైకి ఎక్కారు చంద్రబాబు. భద్రతా సిబ్బంది చెప్పినా వినకుండా రైల్వే ట్రాక్ పైకి ఎక్కి నడుస్తూ వరద ఉదృతిని పరిశీలించారు.  అదే సమయంలో  ఎదురుగా ట్రైన్ వచ్చింది.  వెంటనే  సెక్యూరిటీ అప్రమత్తం కావడంతో  చంద్రబాబు  పక్కకు నిలబడ్డారు దీంతో పెను ప్రమాదం తప్పింది.   చంద్రబాబుకు 3 అడుగుల దూరంలో  రైలు ఆగింది. రైలు వెళ్లాక చంద్రబాబు సేఫ్ గా బయటపడ్డారు.