ఓటీటీలోకి హార్రర్ మూవీ.. ఎప్పుడంటే?

ఓటీటీలోకి హార్రర్ మూవీ.. ఎప్పుడంటే?

రాఘవ లారెన్స్(Raghava Lawrence), కంగ‌నా ర‌నౌత్(Kangana Ranut) కాంబోలో వచ్చిన లేటెస్ట్ హార్రర్ మూవీ చంద్ర‌ముఖి 2(Chandramukhi 2). ఈ మూవీ త్వరలో ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఈ నెల అక్టోబ‌ర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) స్ట్రీమింగ్ అవుతోన్న‌ట్లు స‌మాచారం. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో చంద్ర‌ముఖి 2 ఓటీటీలోకి వచ్చేస్తుంది.

ర‌జ‌నీకాంత్(Rajinikanth), జ్యోతిక(Jyothika) నటించిన క‌ల్ట్ క్లాసిక్ మూవీ చంద్ర‌ముఖికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా.. బాక్సాపీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. పి.వాసు డైరెక్ట్ చేసిన ఈ మూవీ రూ.60కోట్ల‌కుపైగా బ‌డ్జెట్‌తో తెరకెక్కించగా..వరల్డ్ వైడ్ గా రూ.40 కోట్ల‌లోపే వ‌సూళ్ల‌ను రాబట్టింది. దీంతో ఈ మూవీ నిర్మాతలకు దాదాపు రూ.20 కోట్ల మేరకు నష్టం వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. 

దాదాపు 17ఏళ్ల తర్వాత చంద్రముఖి మూవీకు సీక్వెల్‌ తెరకెక్కుతుండటంతో ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే.. ర‌జ‌నీకాంత్ చంద్ర‌ముఖి త‌ర‌హాలో..చంద్రముఖి 2 కూడా హార‌ర్‌, థ్రిల్లింగ్ అంశాలతో ఆడియన్స్ ను మెప్పిస్తుందని భావించారు. కానీ, ముఖ్యమైన థ్రిల్లింగ్ అంశాలన్నీ మిస్స‌య్యాయ‌నే విమ‌ర్శ‌లొచ్చాయి.  

ఈ మూవీలో మ‌హిమా నంబియార్‌, ల‌క్ష్మీ మీన‌న్‌, సుభీక్ష ముఖ్య పాత్ర‌లు పోషించారు. చంద్రముఖి 2 తమిళంలో బాగానే ఆడినప్పటికీ.. తెలుగు ఆడియన్స్ ను మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. థియేటర్లలో చూడలేని వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయొచ్చు.