శేరిలింగంపల్లిలో మార్పు ఖాయం : జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లిలో మార్పు ఖాయం : జగదీశ్వర్ గౌడ్

గచ్చిబౌలి, వెలుగు : శేరిలింగంపల్లి సెగ్మెంట్ వాసులు మార్పును కోరుకుంటున్నారని.. వారంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఆ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్​ గౌడ్ తెలిపారు. మంగళవారం కొండాపూర్ డివిజన్​లోని మార్తాండనగర్, ప్రేమ్​నగర్​లో కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.

ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టోకు జనం ఆకర్షితులవుతున్నారని.. ఈ ఎన్నికల్లో వారి మద్దతు తమకే ఉంటుందని జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.