చార్లీ చాప్లిన్ కూతురు కన్నుమూత.. 10రోజుల తర్వాత వెల్లడించిన కుటుంబసభ్యులు

చార్లీ చాప్లిన్ కూతురు కన్నుమూత.. 10రోజుల తర్వాత వెల్లడించిన కుటుంబసభ్యులు

తన నటనతో, కామెడీతో యావత్ర్పపంచాన్ని కట్టిపడేసిని చార్లీ చాప్లిన్ కూతురు, నటి జోసెఫిన్ చాప్లిన్ మరణించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె కుటుంబసభ్యులే ప్రకటించారు. ప్రస్తుతం ఆమె వయసు 74 సంవత్సరాలు కాగా.. జూలై 13న పారిస్ లో మరణించారని తెలిపారు. కానీ ఆమె మృతికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. అంతే కాదు ఆమె చనిపోయి ఇప్పటికి దాదాపు 10 రోజులు అవుతున్నా.. ఇప్పటివరకు ఆమె మరణ వార్తను ప్రపంచానికి ఎందుకు తెలియకుండా దాచారన్నది కూడా మిస్టరీగా మారింది.

చార్లీ చాప్లిన్, ఊనా ఓ'నీల్‌లకు కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో మార్చి 28, 1949న  జోసెఫిన్ చాప్లిన్ జన్మించారు. ఎనిమిది మంది సంతానంలో ఈమె మూడో సంతానం. ఆమె తన చిన్న తనం  (1952) నుంచే నటనా జీవితాన్ని ప్రారంభించింది.  1969లో నికోలస్ ను పెళ్లి చేసుకుని 1977లో అతని నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాలతో బిజీగా మారిపోయిన జోసెఫిన్.. సుమారు పదేళ్ల తర్వాత 1989లో జీన్ క్లూడ్ గార్డెన్ ను వివాహం చేసుకున్నారు. అతను 2013లో అనారోగ్యంతో మరణించారు. జోసెఫిన్ చాప్లిన్ కు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారు చార్లీ, ఆర్థర్, జూలియన్ రోనెట్.