బీఆర్​ఎస్ ఆఫీస్​కు భూ కేటాయింపుల్ని రద్దు చేయాలి : పద్మనాభరెడ్డి

బీఆర్​ఎస్ ఆఫీస్​కు భూ కేటాయింపుల్ని రద్దు చేయాలి : పద్మనాభరెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాష్ట్ర స్థాయిలో ఆఫీస్​ ఉండగా, మరో ఆఫీస్​ కోసం ఖరీదైన భూమిని తక్కువ రేటుకే కేటాయించడాన్ని సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ హైకోర్టులో సోమవారం పిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలైంది. ఫోరం ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గవర్నెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్ సెక్రటరీ పద్మనాభరెడ్డి ఈ పిల్​ను దాఖలు చేశారు. గండిపేట మండలం కోకాపేటలోని సర్వే నంబర్​ 239, 240ల్లో  బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీకి 11 ఎకరాల భూమి కేటాయింపుపై స్టే ఇవ్వాలని పిల్​లో పేర్కొన్నారు. ఈ కేసులో తుది తీర్పు వచ్చే వరకు ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. 

పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డొమైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా పెట్టలేదుసాధారణంగా ఇలాంటి కేటాయింపులకు నాలుగై దు నెలల సమయం పడుతుందన్నారు. కానీ, ఈ మొత్తం ప్రక్రియ కేవలం 5 రోజుల్లో జరిగిపోయినట్టు పిల్​లో పేర్కొన్నారు. భూ కేటాయింపు వివరాలు పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డొమైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా పెట్టలేదన్నారు. కోకాపేటలో ఎకరం రూ.50 కోట్ల వరకు ఉందని, కానీ బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్​కు రూ.3.41 కోట్లకే కట్టబెట్టారన్నారు. మొత్తంగా రూ.500 కోట్ల విలువైన భూములను రూ.57.47 కోట్లకే అధికార పార్టీ దక్కించుకున్నదన్నారు.  

శిక్షణ సంస్థ పేరుతో ఎలా తీసుకుంటరు?

శిక్షణ, వ్యక్తిత్వ వికాసం పేరుతో ఇనిస్టిట్యూట్ ఫర్ ఎక్స్ లెన్స్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ చేస్తామని చెప్పి బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ అప్లికేషన్ పెట్టుకున్నారని వివరించారు. రాష్ట్ర, జాతీయస్థాయికి చెందిన గ్రామీణ అభివృద్ధి శిక్షణ సంస్థలు ఉండగా బీఆర్ఎస్ శిక్షణ సంస్థ పేరుతో ప్రభుత్వ భూమిని తీసుకుందని పిల్​లో పేర్కొన్నారు. ఇప్పటికే బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వం నుంచి తీసుకున్న భూమిలోనే బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉందని, అందులో అన్ని జిల్లాలకు ఆఫీసులున్నాయని అందులో పేర్కొన్నారు. ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యక్తులకు భూమి కేటాయించేటప్పుడు కచ్చితమైన మార్గదర్శకా లు పాటించాలని ఇటీవలే హైకోర్టు డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్తర్వులిచ్చినట్టు పేర్కొన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ కమిషనర్, ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సీసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ) చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, బీఆర్​ఎస్​ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిల్ ను చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ విచారించనుంది.