ఆన్ లైన్ యాప్స్ నయా దందా : వ్యాపారం పేరుతో కుచ్చుటోపి

ఆన్ లైన్ యాప్స్ నయా దందా : వ్యాపారం పేరుతో కుచ్చుటోపి

హైదరాబాద్: ఆన్ లైన్ యాప్స్ ను బ్లాక్ చేయాలని కోర్టులు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ కొత్తగా వ్యాపారం పేరుతో మరో మోసానికి తెరలేపుతున్నాయి ఆన్ లైన్ యాప్స్. ఆన్‌లైన్ ప్రైవేట్ ఫైనాన్స్ యాప్‌ల ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించి సైబర్ నేరగాళ్లు రూ.6.2 లక్షలకు టోకరా వేశారు. లాభం సంగతి పక్కనపెడితలే పెట్టుబడి పెట్టిన డబ్బులు తిరిగి రాకపోవడంతో మోసపోయామని తెలుసుకున్నారు బాధితిలు. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఓటీపీ పేరుతో బ్యాంకులో ఉన్న మొత్తాన్ని దోచేస్తున్నారని తెలిపారు పోలీసులు.