మొటిమలు రాకుండా ఉండాలంటే..

V6 Velugu Posted on Oct 06, 2020

టీనేజర్స్‌‌‌‌ నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతిఒక్కరికి వచ్చే మొదటి చర్మ సమస్య మొటిమలే! ఆయిల్‌‌‌‌ ఫుడ్‌‌‌‌, జంక్‌‌‌‌ఫుడ్‌‌‌‌ ఎక్కువగా తినడం, పొల్యూషన్‌‌‌‌, హార్మోన్‌‌‌‌ల లోపం వల్ల మొటిమలు వస్తాయి. ఇప్పుడు మాస్క్‌‌‌‌ పెట్టుకోవడం వల్ల కూడా మొటిమలు వస్తున్నాయని కొన్ని స్టడీస్‌‌‌‌ చెప్తున్నాయి. ఎంత అందమైన ముఖమైనా మొటిమలు మంచిగా అనిపించదు.  అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. మన డైలీ లైఫ్‌‌‌‌లో కొన్ని  మార్పులు చేసుకుంటే మొటిమలకు చెక్​ పెట్టొచ్చు.

..రోజూ కనీసం నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల శరీరానికి పోషణ, ఆక్సిజన్‌‌‌‌ అందుతుంది. దీంతో మొటిమలు రాకుండా ఉంటాయి.

..ఆలివ్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ వాడటం వల్ల మొటిమలు రాకుండా చేసుకోవచ్చు. ఆలివ్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ చర్మంలోకి త్వరగా ఇంకిపోతుంది. ఇది చర్మంలో పోర్స్‌‌‌‌ క్లోజ్‌‌‌‌ అవ్వకుండా కంట్రోల్ చేయడం వల్ల గాలి ఆడి మొటిమలు రావు.

.. నిమ్మరసంలోని సిట్రిక్‌‌‌‌ యాసిడ్‌‌‌‌ లివర్‌‌‌‌‌‌‌‌లోని వ్యర్థాలను తొలగించేందుకు ఉపయోగపడుతుంది. లివర్‌‌‌‌‌‌‌‌, రక్తంలోని టాక్సిక్‌‌‌‌ ఎంజైమ్స్‌‌‌‌ పోర్స్‌‌‌‌ నుంచి బయటకు వెళ్లడం వల్ల.. చర్మం ఎప్పుడూ తాజాగా ఉంటుంది.

..మొటిమలు తగ్గిన తర్వాత మచ్చలు ముఖం మీద ఉండిపోతాయి. వీటిని పోగొట్టేందుకు పుచ్చకాయ జ్యూస్‌‌‌‌ బాగా ఉపయోగపడుతుంది. పుచ్చకాయలో విటమిన్‌‌‌‌ ఎ, బి, సి చర్మాన్ని ఎప్పుడూ ఫ్రెష్​గా ఉండేలా చేస్తాయి.

.. బ్యాలెన్స్డ్‌‌‌‌ డైట్‌‌‌‌ తీసుకోవడం వల్ల మొటిమలను ఈజీగా తగ్గించుకోవచ్చు.

..తక్కువ ఫ్యాట్‌‌‌‌ ఉన్న డైరీ ప్రాడక్ట్స్‌‌‌‌లో ఉండే విటమిన్‌‌‌‌–ఎ.. చర్మాన్ని హెల్దీగా ఉంచేందుకు సాయపడుతుంది.

.. యోగర్ట్‌‌‌‌లో యాంటీఫంగల్‌‌‌‌, యాంటీ బ్యాక్టీరియల్‌‌‌‌ క్వాలిటీస్ చర్మానికి క్లెన్సింగ్‌‌‌‌లా ఉపయోగపడతాయి. అంతేకాకుండా మూసుకుపోయిన పోర్స్‌‌‌‌ను అన్‌‌‌‌బ్లాక్‌‌‌‌ చేస్తాయి.

.. రోజుకు కొన్ని వాల్‌‌‌‌నట్స్ తినడం వల్ల మన చర్మం మృదువుగా తయారవుతుంది. వాటిలో ఉండే ఆయిల్స్‌‌‌‌, లినోలిక్ యాసిడ్‌‌‌‌ స్కిన్‌‌‌‌ స్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ మెయింటైన్‌‌‌‌ చేసేందుకు, ఎప్పుడూ హైడ్రేట్‌‌‌‌గా ఉండేందుకు ఉపయోగపడతాయి.

..రోజుకో యాపిల్‌‌‌‌ తినడం వల్ల కూడా మొటిమలు రావని ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ అంటున్నారు. యాపిల్‌‌‌‌లో ఉండే పెక్టిన్‌‌‌‌ మొటిమలను నివారిస్తుందని చెప్తున్నారు.

 

 

Tagged Check, pimples, Daily Life, make some changes

Latest Videos

Subscribe Now

More News