బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు అరెస్ట్

బీజేపీ స్టేట్  చీఫ్ రామచందర్ రావు అరెస్ట్

 తెలంగాణ బీజీపీ చీఫ్  రామచందర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయనను పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు.  దీంతో బీజేపీ కార్యకర్తలు ఆయన ఇంటి ముందు ఆందోళన చేశారు. పోలీసులు అడ్డుకుని వాదించారు. దీంతో పోలీసులకు ,బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

కామారెడ్డి ఎమ్మెల్యే ఇంటిమీద కాంగ్రెస్ నేతలు చేసిన దాడి నేపథ్యంలో  కామారెడ్డి బయలుదేరాలనుకున్న  రామచంద్రరావుని  పోలీసులు తార్నాకలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు.  రామచంద్రరావుని హౌస్ అరెస్టు చేసిన నేపథ్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు . అనంతరం కామారెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా  రాంచందర్రావు మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని పరామర్శించడానికి వెళ్ళాలనుకున్న తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి పెద్దఎత్తున పోలీసులను మోహరించారని  అన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో కామారెడ్డికి బయలుదేరి తీరుతానని  రామచంద్రరావు  అన్నారు. అలాగే బాన్సువాడలో జరిగిన కొన్ని ఘర్షణలకు  హిందూ సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయన్నారు. ఘర్షణలో దాదాపు 100 మంది బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయడం జరిగిందన్నారు.