
- ఇద్దరి వద్ద రూ.11 లక్షలు కాజేత
మెహిదీపట్నం, వెలుగు: క్రిప్టో కరెన్సీ పేరుతో ఇద్దరిని మోసం చేసి, రూ.11 లక్షలు కాజేసిన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు సౌత్ వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ కృష్ణ గౌడ్ తెలిపారు. టోలిచౌకికి చెందిన సాయిప్రసాద్ రెడ్డి క్రిప్టో కరెన్సీ కోసం ఆన్లైన్లో వెతుకుతుండగా ఇదే ప్రాంతానికి చెందిన మజా పరిచయమయ్యాడు. తన స్నేహితుడి వద్ద రూ.10 లక్షల విలువైన క్రిప్టో కరెన్సీ ఉందని నమ్మించి, ఈ నెల 25న అతని ఆఫీస్కు తీసుకెళ్లాడు. అక్కడ సాయిప్రసాద్ రెడ్డి వద్ద రూ.6.40లక్షలు, మరో వ్యక్తి వద్ద రూ.5 లక్షల తీసుకొని ఉడాయించాడు.
ఈ కేసుకు సంబంధించి జూ పార్క్ బహదూర్ పురకు చెందిన మహ్మద్ బిలాల్, టోలిచౌకి హకీంపేటకు చెందిన అబ్దుల్ అలియాస్ పర్వీజ్, జమీల్ అమీద్, శంషాబాద్ మొహల్లా ప్రాంతానికి చెందిన ఇక్బాల్, టోలిచౌకి ఎండీ లైన్స్ వాసి సయ్యద్ మాజ్ హుస్సేన్ ను పోలీసులు అరెస్ట్చేశారు. ఈ కేసులో మరో నలుగురు పరారీలో ఉన్నట్లు అడిషనల్ డీసీపీ పేర్కొన్నారు.