ప్రైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాలీబాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీగ్‌‎లో చెన్నై బ్లిట్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలుపు

 ప్రైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాలీబాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీగ్‌‎లో చెన్నై బ్లిట్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలుపు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,వెలుగు: ప్రైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాలీబాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (పీవీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) నాలుగో సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెన్నై బ్లిట్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీలక విజయం సాధించింది. బుధవారం గచ్చిబౌలి ఇండోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో ఐదు సెట్ల పాటు జరిగిన  ఉత్కంఠ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  చెన్నై 3–2 (15-–10, 10-–15, 15-–11, 12–-15, 15-–13)తో అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిఫెండర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  గెలిచింది. 

ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెట్‎కు ఇరు జట్ల మధ్య ఆధిక్యం చేతులు మారింది. నిర్ణయాత్మక ఐదో సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెన్నై పైచేయి సాధించింది.  జెరోమి వినిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆదిత్య రాణా, సూర్య ఆ జట్టును గెలిపించారు. ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో బ్లిట్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడో విజయం అందుకుంది.  దాంతో ఆరు పాయింట్లతో ఆరో స్థానానికి చేరుకుంది.