చెన్నై సూపర్​..6 వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలుపు

చెన్నై సూపర్​..6 వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలుపు
  •     రాణించిన ముస్తాఫిజుర్‌‌‌‌, రచిన్‌‌‌‌, శివమ్‌‌‌‌ దూబే
  •     రావత్‌‌‌‌, దినేశ్‌‌‌‌ కార్తీక్‌‌‌‌ శ్రమ వృథా

చెన్నై : ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో చెలరేగిన చెన్నై సూపర్‌‌‌‌కింగ్స్‌‌‌‌.. ఐపీఎల్‌‌‌‌–17లో బోణీ చేసింది. బౌలింగ్‌‌‌‌లో ముస్తాఫిజుర్‌‌‌‌ (4/29), బ్యాటింగ్‌‌‌‌లో రచిన్‌‌‌‌ రవీంద్ర (37), శివమ్‌‌‌‌ దూబే (34 నాటౌట్‌‌‌‌) చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన తొలి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో సీఎస్కే 6 వికెట్ల తేడాతో బెంగళూరుకు చెక్‌‌‌‌ పెట్టింది. టాస్‌‌‌‌ గెలిచిన బెంగళూరు 20 ఓవర్లలో 173/6 స్కోరు చేసింది. అనూజ్‌‌‌‌ రావత్‌‌‌‌ (48), దినేశ్‌‌‌‌ కార్తీక్‌‌‌‌ (38 నాటౌట్‌‌‌‌), కెప్టెన్‌‌‌‌ డుప్లెసిస్‌‌‌‌ (35) దంచికొట్టారు. 

ఆరంభంలో విరాట్‌‌‌‌ కోహ్లీ (21) మెల్లగా ఆడగా, డుప్లెసిస్‌‌‌‌ ఫోర్‌‌‌‌తో ఖాతా తెరిచాడు. ఆ వెంటనే మరో రెండు ఫోర్లతో టచ్‌‌‌‌లోకి వచ్చాడు. థర్డ్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో నాలుగు ఫోర్లతో జోరు పెంచాడు. అయితే ఐదో ఓవర్‌‌‌‌లో ముస్తాఫిజుర్‌‌‌‌ ఆర్‌‌‌‌సీబీకి డబుల్‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌ ఇచ్చాడు. 4 బాల్స్‌‌‌‌ తేడాలో డుప్లెసిస్‌‌‌‌, రజత్‌‌‌‌ పటీదార్‌‌‌‌ (0)ను ఔట్‌‌‌‌ చేశాడు. తొలి వికెట్‌‌‌‌కు 41 రన్స్‌‌‌‌ భాగస్వామ్యం బ్రేక్‌‌‌‌ అయ్యింది. తర్వాతి ఓవర్‌‌‌‌లో దీపక్‌‌‌‌ చహర్‌‌‌‌ (1/37).. మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ (0)ను డకౌట్‌‌‌‌ చేశాడు. దీంతో పవర్‌‌‌‌ప్లేలో ఆర్‌‌‌‌సీబీ 42/3 స్కోరు చేసింది. కోహ్లీతో కలిసి కామెరూన్‌‌‌‌ గ్రీన్‌‌‌‌ (18) వేగంగా సింగిల్స్‌‌‌‌ తీస్తూ స్ట్రయిక్‌‌‌‌ రొటేట్‌‌‌‌ చేశాడు. 10వ ఓవర్‌‌‌‌లో కోహ్లీ సిక్స్‌‌‌‌ కొట్టడంతో స్కోరు 75/3కి పెరిగింది. 

కానీ 12వ ఓవర్‌‌‌‌లో ముస్తాఫిజుర్‌‌‌‌ మళ్లీ దెబ్బకొట్టాడు. మూడు బాల్స్‌‌‌‌ తేడాలో కోహ్లీ, గ్రీన్‌‌‌‌ను పెవిలియన్‌‌‌‌కు పంపడంతో ఫోర్త్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 35 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. ఇక 78/5 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన దినేశ్‌‌‌‌, రావత్‌‌‌‌ భారీ హిట్టింగ్‌‌‌‌తో చెలరేగిపోయారు. 15వ ఓవర్‌‌‌‌లో రెండు ఫోర్లతో రావత్‌‌‌‌ జోష్‌‌‌‌ పెంచితే, తర్వాతి ఓవర్లో కార్తీక్‌‌‌‌ 6,4తో రెచ్చిపోయాడు. 18వ ఓవర్‌‌‌‌లో ఇద్దరు కలిసి 6, 6, 6, 4తో 25 రన్స్‌‌‌‌ దంచారు. 19వ ఓవర్‌‌‌‌లో 6, 4తో 16 రన్స్‌‌‌‌ రాబట్టారు. ఆఖరి ఓవర్‌‌‌‌లో కార్తీక్‌‌‌‌ ఫోర్‌‌‌‌ కొట్టగా, రావత్‌‌‌‌ వికెట్‌‌‌‌ ఇచ్చుకున్నాడు. ఈ ఇద్దరు ఆరో వికెట్‌‌‌‌కు 50 బాల్స్‌‌‌‌లోనే 90 రన్స్‌‌‌‌ జత చేసి భారీ టార్గెట్‌‌‌‌ను నిర్దేశించారు. 

రఫ్పాడించిన రచిన్‌‌‌‌..

టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో చెన్నై 18.4 ఓవర్లలో 176/4 స్కోరు చేసి గెలిచింది. ఓపెనర్లు రుతురాజ్‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌ (15), రచిన్‌‌‌‌ రవీంద్ర మంచి ఆరంభాన్నిచ్చారు. మూడు ఓవర్లలోనే 30 రన్స్‌‌‌‌ చేశారు. కానీ 4వ ఓవర్‌‌‌‌లో యష్‌‌‌‌ దయాల్‌‌‌‌ (1/28) దెబ్బకు రుతురాజ్‌‌‌‌ ఔట్‌‌‌‌ కావడంతో ఫస్ట్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 38 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. రహానె (27), రవీంద్ర మెరుగ్గా ఆడటంతో పవర్‌‌‌‌ప్లేలో సీఎస్కే 62/1 స్కోరుతో నిలిచింది. 7వ ఓవర్‌‌‌‌లో సిక్స్‌‌‌‌ కొట్టిన రచిన్‌‌‌‌ లాస్ట్‌‌‌‌ బాల్‌‌‌‌కు వెనుదిరిగాడు.

డారిల్‌‌‌‌ మిచెల్‌‌‌‌ (22) రెండు వరుస సిక్సర్లు బాదడంతో ఫస్ట్‌‌‌‌ టెన్‌‌‌‌లో చెన్నై 92/2 స్కోరు చేసింది. 11వ ఓవర్‌‌‌‌లో రహానెను గ్రీన్‌‌‌‌ (2/27) ఔట్‌‌‌‌ చేయడంతో స్కోరు 102/3గా మారింది. ఈ దశలో దూబే నిలకడగా రన్స్‌‌‌‌ చేశాడు. 13వ ఓవర్‌‌‌‌లో మిచెల్‌‌‌‌ ఔటైనా.. జడేజా (25 నాటౌట్‌‌‌‌)తో కలిసి ఈజీగా విజయాన్ని అందించాడు. జడేజా, దూబే ఐదో వికెట్‌‌‌‌కు 66 రన్స్‌‌‌‌ జోడించారు. ముస్తాఫిజుర్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 

టీ20ల్లో 12 వేల రన్స్‌‌‌‌ చేసిన తొలి ఇండియన్ బ్యాటర్‌‌‌‌గా కోహ్లీ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌‌‌‌గా క్రిస్‌‌‌‌ గేల్‌‌‌‌ (14,562), షోయబ్‌‌‌‌ మాలిక్‌‌‌‌ (13,360), పొలార్డ్‌‌‌‌ (12,900), అలెక్స్‌‌‌‌ హేల్స్‌‌‌‌ (12, 319), వార్నర్‌‌‌‌ (12,065) ముందున్నారు.