చెస్‌‌‌‌ ఒలింపియాడ్‌‌‌‌లో శుభారంభం

చెస్‌‌‌‌ ఒలింపియాడ్‌‌‌‌లో శుభారంభం

బుడాపెస్ట్: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌‌‌‌ను ఇండియా జట్లు విజయంతో ఆరంభించాయి. తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్‌‌‌‌ తో పాటు మిగతా ముగ్గురూ తమ గేమ్స్‌‌‌‌లో నెగ్గడంతో బుధవారం జరిగిన తొలి రౌండ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఓపెన్‌‌ సెక్షన్‌‌లో ఇండియా 4–0తో మొరాకోను చిత్తు చేసింది. నల్ల పావులతో ఆడిన అర్జున్‌‌‌‌ 40 ఎత్తుల్లో జాక్వెస్‌‌‌‌ ఎల్బిలాను ఓడించాడు. విదిత్‌‌‌‌ 28 ఎత్తుల్లోనే మెహ్డి పిరేపై నెగ్గగా, పెంటేల హరికృష్ణ 33 ఎత్తుల్లో అనాస్‌‌‌‌పై, ప్రజ్ఞానంద 30 ఎత్తుల్లో తిసిర్‌‌‌‌‌‌‌‌పై గెలిచారు. అమ్మాయిల జట్టు తొలి రౌండ్‌‌లో జమైకాను ఓడించింది.