అర్జున్‌కు ఏడో విజయం

అర్జున్‌కు ఏడో విజయం

బుడాపెస్ట్‌ : చెస్‌ ఒలింపియాడ్‌లో ఇండియా దూసుకుపోతోంది. గురువారం జరిగిన  ఓపెన్‌ సెక్షన్‌ ఎనిమిదో రౌండ్‌లో మెన్స్‌ టీమ్‌ 3.5–0.5 తో ఇరాన్‌పై గెలిచింది. డానేశ్వర్‌ బర్డియాతో జరిగిన గేమ్‌లో ఎరిగైసి అర్జున్‌ 36 ఎత్తుల వద్ద నెగ్గాడు. 

ఇతర గేమ్‌ల్లో డి. గుకేశ్‌ 34 ఎత్తులతో మగ్‌షుల్డో పర్హామ్‌పై, విదిత్‌ 40 ఎత్తులతో ఇదానీ పోయాపై గెలిచారు. అమిన్‌తో జరిగిన గేమ్‌ను ఆర్‌. ప్రజ్ఞానంద 32 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు.