కౌంటీల్లో టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ పుజారా చిచ్చరపిడుగులా చెలరేగుతున్నాడు. విధ్వంసకర ఆటతీరుతో అదరగొడుతున్నాడు. ధనాధన్ ఇన్నింగ్స్లతో దుమ్మురేపుతున్నాడు. రాయల్ లండన్ వన్డే కప్లో సస్సెక్స్ టీమ్కు ఆడుతున్న పుజారా..సెంచరీల మోత మోగిస్తున్నాడు.
మూడో సెంచరీ..
రాయల్ లండన్ వన్డే కప్లో ఇప్పటికే రెండు శతకాలు బాదిన పుజారా..తాజాగా మూడో సెంచరీ సాధించాడు. మిడిల్ సెక్స్ టీమ్తో జరిగిన మ్యాచులో పుజారా శతక్కొట్టాడు. కేవలం 75 బంతుల్లో 20 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ నమోదు చేశాడు. మొత్తంగా 90 బంతులు ఎదుర్కొని 132 పరుగులు చేశాడు. పుజారా సూపర్ సెంచరీతో సస్సెక్స్ టీమ్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 400 పరుగుల భారీ స్కోర్ సాధించడం విశేషం. అనంతరం 401 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన మిడిల్ సెక్స్ టీమ్ 166 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓడిపోయింది.
A century from just 75 balls for @cheteshwar1. ? ?
— Sussex Cricket (@SussexCCC) August 23, 2022
Just phemeomenal. ? pic.twitter.com/z6vrKyqDfp
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు..
వార్‌విక్‌షైర్ క్లబ్ మ్యాచ్‌లోనూ పుజారా సెంచరీతో చెలరేగాడు. కేవలం 73 బంతుల్లోనే శతకం కొట్టాడు. సుర్రేతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 174 పరుగులు చేశాడు. దీంతో తన ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఇప్పటి వరకు రాయల్ లండన్ వన్డే కప్-2022లో 500 పరుగుల మార్క్‌ను దాటిన రెండో బ్యాట్స్మన్గా పుజారా నిలిచాడు.
