పవిత్ర నదుల్లో ఒకటైన యమునా నదిలో కలుషిత రసాయనాలు చేరడంతో తెల్లటి నురగ ఇలా తేలియాడుతోంది. ఛాత్ పూజలో భాగంగా నదీ తీరంలో ఉదయించే సూర్యుడిని పూజించేందుకు మహిళలు ఢిల్లీలోని కాళింది కుంజ్ వద్దకు చేరుకున్నారు. నదీతీరం ఇదిగో ఇలా తెల్లటి నురుగుతో ప్రమాదకరంగా కనిపించినా లెక్కచేయక వాళ్లు పూజలు నిర్వహించారు. ఓవైపు వర్షం, కింద ఈ నురుగలు ఇబ్బంది పెడుతున్నా సూర్యోదయం వరకూ వెయిట్ చేసి పూజ పూర్తిచేశారు.

