ఖిలా వరంగల్(మామునూరు), వెలుగు: ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపన వివాదం తారస్థాయికి చేరింది. విగ్రహం కోసం ఊరిలోని రెండు కులాల వారు రెండు వర్గాలుగా విడిపోయారు.
కొద్దిరోజులుగా శివాజీ విగ్రహ ప్రతిష్టాపనపై ఉద్రిక్తత నెలకొంది. గురువారం బొల్లికుంటలో గ్రామస్తులు రెండువర్గాలుగా విడిపోయి ధర్నా నిర్వహించారు. కలెక్టర్ వచ్చేదాకా కదిలేదే లేదని గ్రామస్తులు భీష్మించారు. మామునూరు ఏసీపీ వెంకటేశ్, ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్, సీఐ శ్రీనివాస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
