ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు : ముందంజలో కాంగ్రెస్

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు : ముందంజలో కాంగ్రెస్

ఛత్తీస్‌గఢ్ లో నవంబర్ 7, 17తేదీల్లో రెండు దశల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నేడు వెలువడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. ఇప్పటివరకు కాంగ్రెస్ 40స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 29స్థానాల్లో ముందంజలో ఉంది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఈ సారి పోటీ రసవత్తరంగా మారనుంది. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (BSP), జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (JCC) కూడా రాష్ట్రంలోని ఇతర రెండు ముఖ్యమైన పార్టీలు.

2018 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 68 సీట్లు గెలుచుకుని భూపేష్ భఘేల్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 2003, 2008, 2013లో వరుసగా మూడు విజయాల తర్వాత డాక్టర్ రమణ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ కేవలం 15 సీట్లు మాత్రమే గెలుచుకుంది.