ఏడుగురు షట్లర్లకు ఒలింపిక్స్‌‌‌‌ బెర్తులు

ఏడుగురు షట్లర్లకు ఒలింపిక్స్‌‌‌‌ బెర్తులు

న్యూఢిల్లీ: ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు ముచ్చటగా మూడోసారి ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోటీ పడనుంది. సింధు సహా ఏడుగురు ఇండియా షట్లర్లు పారిస్ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్వాలిఫై అయ్యారు. తమ ఒలింపిక్ క్వాలిఫికేషన్ ర్యాంకింగ్స్ ఆధారంగా నాలుగు విభాగాల్లో పారిస్ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అధికారికంగా అర్హత సాధించారు. క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కటాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేట్ అయిన సోమవారం నాటికి టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–16 ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న వారికి బెర్తులు లభించాయి. సింధు విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 12వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రణయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరుసగా 9, 13వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో మెన్స్ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్వాలిఫై  అయ్యారు. మెన్స్ డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సాత్విక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాయిరాజ్–చిరాగ్ మూడో స్థానంతో క్వాలిఫై అయి మెడల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప 13వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బెర్త్ దక్కించుకున్నారు.