
- పనులు ప్రారంభించిన కోరమాండల్ ఇంటర్నేషనల్
న్యూఢిల్లీ: ఎరువుల తయారీ కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ దగ్గర ఫాస్ఫరిక్ యాసిడ్, సల్ఫరిక్ యాసిడ్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ.1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఈ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యామని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కోరమాండల్ పేర్కొంది. ఈ నెల 26 న జరిగిన ప్లాంట్ శంకుస్థాపనలో కంపెనీ చైర్మన్ అరుణ్ అలగప్పన్ పాల్గొన్నారు. ‘రూ.1,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాం. రెండేళ్లలో ప్రొడక్షన్ మొదలవుతుంది. రోజుకి 650 టన్నుల ఫాస్ఫరిక్ యాసిడ్‌ను తయారు చేసే ఈ ప్లాంట్‌ను అడ్వాన్స్డ్ డీఏ–హెచ్‌ఎఫ్ (డైహైడ్రేట్ ఎటాక్– హెమిహైడ్రేట్ ఫిల్ట్రేషన్) ప్రాసెస్ టెక్నాలజీ, ఆటోమేటెడ్ డీసీఎస్ సిస్టమ్‌తో నిర్మిస్తున్నాం’ అని కంపెనీ వెల్లడించింది. సల్ఫరిక్ యాసిడ్ తయారీ కోసం 1800 టీపీడీ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయనుంది.