
చెంగ్డు (చైనా): థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఇండియా మెన్స్ టీమ్ క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. సోమవారం జరిగిన గ్రూప్–సి మ్యాచ్‌లో ఇండియా 5–0తో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. వరుసగా రెండో విక్టరీతో మరో మ్యాచ్ మిగిలుండగానే నాకౌట్ బెర్తు ఖాయం చేసుకుంది. తొలి సింగిల్స్‌లో ప్రణయ్ 21-–15, 21–-15తో హారీ హువాంగ్‌ను ఓడించి జట్టుకు శుభారంభం అందించాడు. డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ 21–17, 19–21, 21–15తో బెన్ లేన్–సీన్ వెండీపై మూడు గేమ్స్ పాటు పోరాడి గెలిచారు. రెండో సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21–16, 21–16తో నదీమ్ డెల్విని ఓడించడంతో ఇండియా విజయం ఖరారైంది. మరో డబుల్స్‌లో అర్జున్–ధ్రువ్, చివరి సింగిల్స్‌లో కిరణ్ జార్జ్ తమ ప్రత్యర్థులపై నెగ్గి ఇంగ్లండ్‌ను వైట్‌వాష్ చేశారు. బుధవారం జరిగే గ్రూప్ –సి చివరి మ్యాచ్‌లో ఇండోనేసియాతో ఇండియా పోటీపడుతుంది.