ఆర్టీసీలో ఆ సర్క్యులర్‌‌ అన్యాయం

ఆర్టీసీలో ఆ సర్క్యులర్‌‌ అన్యాయం

ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులకు ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ నిలిపివేస్తూ జారీ చేసిన సర్క్యులర్​ను తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ తీవ్రంగా ఖండించారు. 

ఇప్పటికే చాలీచాలని జీతాలతో, పెరిగిన పనిభారంతో ఇబ్బందులు పడుతున్న కార్మికులకు ఉన్న రాయితీలను తొలగించడం సమంజసం కాదన్నారు. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి ఈ సర్క్యులర్​ను రద్దు చేయాలని బుధవారం ఆయన కోరారు.