
హైదరాబాద్, వెలుగు: మహావీర్ జయంతి సందర్భంగా ఆదివారం గ్రేటర్పరిధిలోని చికెన్, మటన్, బీఫ్ షాపులను క్లోజ్చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఉత్తర్వులు జారీ చేశారు. సిటీలోని కబేళాలతోపాటు అన్ని మాంసం దుకాణాలను మూసివేయాలని పేర్కొన్నారు. ఎక్కడైనా మాంసం అమ్మకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.