23న పలు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన

23న పలు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 23వ తేదీన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలకు వెళ్లనున్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే.  ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగింది. ఈ క్రమంలో రైతులను ఆదుకునేందుకు నష్టాన్ని అంచనా వేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. మరోవైపు ఇప్పటికే మంత్రులు పంట నష్టం జరిగిన జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌ పర్యటన సైతం ఖరారైంది.

మార్చి 23వ తేదీన మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం రెడ్డికుంట తండాలో దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించనున్నారు. బాధిత రైతులతో మాట్లాడనున్నారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి చేరుకోనున్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. 

https://twitter.com/TelanganaCMO/status/1638563888672444416