కూనంనేని నోరు అదుపులో పెట్టుకో : బీజేపీ రాష్ట్ర నేత చీకోటి ప్రవీణ్

కూనంనేని నోరు అదుపులో పెట్టుకో : బీజేపీ రాష్ట్ర నేత చీకోటి ప్రవీణ్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: దేశ ప్రధానిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు చీకోటి ప్రవీణ్ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూనంనేని వ్యాఖ్యలు ఆయన రాజకీయ అజ్ఞానానికి, దివాలాకోరుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కూనంనేని ముందు ఆయన పార్టీ పరిస్థితి చూసుకోవాలని, ఇప్పటికే ఆ పార్టీ వెంటిలేషన్‌‌‌‌‌‌‌‌పై ఉందని గుర్తుచేశారు. ఉనికి కోసం పాకులాడుతూ.. దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న ప్రధాని మోదీపై విమర్శలు చేయడం సరికాదని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు మరిచి, వ్యక్తిగత దూషణలకు దిగడం రాజకీయ పతనానికి సంకేతమని విమర్శించారు. రాజకీయాల్లో హుందాతనం, పరిణతి ఉండాలన్నా రు.