హైదరాబాద్, వెలుగు: ప్రెసిషన్ ఇంజనీరింగ్ సేవలు అందించే బాలు ఫోర్జ్ ఇండస్ట్రీస్ ఆదాయం జూన్ క్వార్టర్లో 29 శాతం పెరిగి రూ.300.7 కోట్లకు చేరుకుంది. ఇబిటా 17.3 శాతం వృద్ధితో రూ.84.8 కోట్లకు చేరింది. లాభం 15.9 శాతం పెరిగి రూ.66.1 కోట్లుగా నమోదైంది. కంపెనీ సీఎండీ జస్పాల్ సింగ్ ఈ ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు.
అమెరికా నుంచి తొలి ఏరోస్పేస్ ఆర్డర్ లభించడం తమ ప్రయాణంలో మైలురాయని తెలిపారు. రక్షణ రంగంలో భారీ క్యాలిబర్ ఫిరంగి గుళ్ల తయారీతోపాటు సాయుధ వాహనాల విడిభాగాల అభివృద్ధిలోనూ సంస్థ దూసుకుపోతోంది. అధునాతన తయారీ సామర్థ్యాలను మరింత విస్తరించి గ్లోబల్ మార్కెట్లో బలమైన స్థానాన్ని దక్కించుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
