అనాథ ఆశ్రమాలకు యాచకుల తరలింపు

అనాథ ఆశ్రమాలకు యాచకుల తరలింపు

పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్​, మెట్రో స్టేషన్‌‌‌‌ పరిసరాల్లో నివసిస్తున్న అనాథలు, యాచకులను చిలకలగూడ పోలీసులు గురువారం అనాథాశ్రమాలకు తరలించారు. ఇక్కడ ప్రతి రోజు జరిగే అన్నదానాల కారణంగా అనాథలు, బిచ్చగాళ్ల సంఖ్య పెరుగుతోంది. గుర్తు తెలియని మృతుల కేసులు కూడా పెరుగుతున్నాయి. దీంతో ఏసీపీ శశాంక్‌‌‌‌రెడ్డి, ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌వో అనుదీప్‌‌‌‌ స్పెషల్​ డ్రైవ్‌‌‌‌ నిర్వహించారు. అనాథలకు కౌన్సెలింగ్‌‌‌‌ ఇచ్చి చౌటుప్పల్‌‌‌‌ లోని అమ్మానాన్న అనాథాశ్రమంకు ప్రత్యేక వాహనంలో తరలించారు.