
అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం మూసీ కాల్వలో స్థానికులకు దొరికింది. నల్లగొండ శివారలో్ల ని ముళ్ల పొదల్లో గొంతెండిపోయి చచ్చిపడి ఉన్న పసిగుడ్డును పశువుల కాపరి గుర్తించాడు. హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో వైద్యం కోసం శిశువును తీసుకొచ్చి చేర్చిన కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే చెప్పకుండా వెళ్లిపోయారు. ఈ ఘటనలన్నిం టిలోనూ బాధితులు
ఆడ శిశువులే!
15లో 13 మంది ఆడ శిశువులే గతేడాది 97 మంది శిశువుల మృతదేహాలు హైదరాబాద్ చుట్టుపక్కనే లభించాయి. అందులో 95 మృతదేహాలు ఆడ శిశువులవే. మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్వహించే శిశు గృహాలకు నెలకు సగటున 15 మంది అప్పుడే పుట్టిన శిశువులు వస్తే, వారిలో 13 మంది ఆడ శిశువులే. ప్రస్తుతం మన రాష్ట్రంలోని ప్రభుత్వ హోమ్‌లలో మొత్తం 1,148 మంది ఆడ పిల్లలు పెరుగుతున్నా రు. గతేడాది 180 మంది చిన్నారులు శిశుగృహాలకు చేరారు. వీరిలో 85 శాతం ఆడ శిశువులేనని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు చెప్పారు. పిల్లల్ని బయట పడేయకుండా చంపి పూడ్చిపెట్టే ఘటనలు రికార్డులకు ఎక్కడం లేదు. వాటిలోనూ ఆడ శిశువులే అధికం. మారుమూల తండాల్లో ఆడపిల్లపై వివక్ష ఇంకా ఉంది.