మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో రైలులో డెలివరీ

మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో రైలులో డెలివరీ

మహబూబాబాద్ రూరల్, అర్బన్: రాప్తీ సాగర్ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌లో ఓ మహిళకు డెలివరీ అయిన ఘటన మహబూబాబాద్ రైల్వే స్టేషన్​లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. లక్నోకు చెందిన 8 నెలల గర్భవతి సాలేహాకు పురిటి నొప్పులు రావడంతో శనివారం రైలులోనే కవలలకు జన్మనిచ్చింది.

మహబూబాబాద్ స్టేషన్‌‌‌‌లో రైలు ఆపి తల్లి, శిశువులను ప్రభుత్వాప్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శిశువులు మృతి చెందారు. లక్నోకు చెందిన తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులతో మృతదేహాలను తరలించలేకపోయారు. కంకర్‌‌‌‌బోర్డ్ ముస్లిం యువకులు ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేసి మానవత్వంచాటారు.